ఆసిఫాబాద్‌అర్బన్: నూతనంగా అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద బుధవారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మా ట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లు తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు– 2022 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కేరళ ప్రభుత్వం మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, కోశాధికారి ఆనందరావు, మండల అధ్యక్షుడు కమలాకర్, నాయకులు నర్స య్య, సదయ్య, రాంచందర్, మురళీ, బాలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


