‘క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి’

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

ఆసిఫాబాద్‌: క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపే తం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ దిశానిర్దేశ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన అరిగెల నాగేశ్వర్‌రావు, గొల్లపల్లి వీరభద్రాచారిని ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, నాయకులు కొట్నా క విజయ్‌కుమార్‌, అరిగెల మల్లికార్జున్‌, కోవ విజయ్‌, సుంకరి పెంటు, మెకర్తి లచ్చన్న, కోట గొల్లయ్య, మెరుగు శంకర్‌, విశ్రాంత ఎస్సై వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement