అటవీ జంతువుల సంరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అటవీ జంతువుల సంరక్షణకు చర్యలు

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ హాల్‌లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం పశుసంవర్ధకశాఖ, అటవీశాఖ సిబ్బందికి ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్‌కుమార్‌, రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌, సైంటిస్టు అజయ్‌ గౌర్‌, బయాలజిస్ట్‌ ఎల్లంతో కలిసి ప్రత్యేక సూచనలు అందించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్‌వోలు గోవింద్‌, చంద్‌ సర్దార్‌, యోగేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతుబీమా అందించాలి

నా భర్త మాచర్ల సాహెబ్‌రావు పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వంకాయ, మిర్చి, టమాటా పండించేవారు. అధిక వర్షాలతో పంట నష్టం జరిగింది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు రాకపోవడంతో అప్పుల బాధతతో 2021 సెప్టెంబర్‌ 8న గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జీవో 194 ప్రకారం రైతుబీమా, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలి.

– మాచర్ల రేఖ, నెహ్రూనగర్‌, మం.కెరమెరి

వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలి

ఎలాంటి ఆధారం లేని నిరుపేద కుటుంబానికి చెందిన నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. కనీస అవసరాలు తీర్చేవారు కూడా లేరు. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేసి బాసటగా నిలవాలి.

– డబ్బుల బాపు, మొట్టగూడ, మం.దహెగాం

ఉపాధి కల్పించేందుకు కుట్టు శిక్షణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీవో దత్తారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల యూనిఫాం కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ట్రైనర్లకు పలు సూచనలు చేశారు. శిక్షణకు వచ్చిన వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఏపీసీ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, డీపీఎం నాగజ్యోతి, ట్రైనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement