బకాయిల వసూలుకు బంపర్‌ ఆఫర్లు | - | Sakshi
Sakshi News home page

బకాయిల వసూలుకు బంపర్‌ ఆఫర్లు

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

● కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో రూ.1.61 కోట్లు పెండింగ్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పేరుకుపోయిన పన్నుల బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు. వందశాతం లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మొత్తం బకాయిలు చెల్లించిన వారికి బహుమతులు అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. లక్కీడ్రా ద్వారా మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్‌, రెండో బహుమతి మిక్సర్‌ గ్రైండర్‌, మూడో బహుమతిగా రైస్‌కుక్కర్‌ అందించనున్నారు. మున్సిపాలిటీలో 14,088 గృహాలు ఉండగా రూ.3.80 కోట్ల పన్నుల టార్గెట్‌కు ఇప్పటివరకు రూ.2.19కోట్లు వసూలైంది. ఆదివారం వరకు 58.09 శాతం వసూలు కాగా మరో రూ.1.61 కోట్లు పెండింగ్‌ ఉంది. పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ ఆఫర్‌ కొనసాగుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement