ఆసిఫాబాద్: మహిళపై ఆర్థిక భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వా రా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని కలెక్టర్ హరిత అన్నారు. 2026 మార్చి 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సేవలు(290 కోట్ల ఉచిత ప్రయాణాలు) పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో విజయోత్సవాలు నిర్వహించారు. డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళా ఉద్యోగులు విద్య, వైద్యం, కుటుంబ అవసరాల కోసం సులభంగా వెళ్లగలుగు తున్నారని తెలిపారు. మహిళలతోపాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ హరితతోపాటు పలువురు మహిళా ప్రయాణికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల, ఉపాధ్యాయురాలు శైలజ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.


