ఆసిఫాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన అరిగెల నాగేశ్వర్‌రావును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌రావుకు రాష్ట్ర పదవి దక్కింది. అలాగే ఆయనతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కాగజ్‌నగర్‌కు చెందిన గొల్లపల్లి వీరభద్రాచారికి అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అమర్‌సింగ్ తిలావత్‌ను నియమించారు. నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనకు రాష్ట్ర పదవి కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.


