కనెక్షన్‌.. ఇక ఈజీ | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్‌.. ఇక ఈజీ

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

● నూతన విద్యుత్‌ సర్వీసు మంజూరు నిబంధనలు సులభతరం ● కిలోమీటరు వరకు చార్జీలు ఎత్తివేత ● 1 నుంచి 5 కిలోవాట్‌ వరకు రూ.500 సర్వీస్‌ చార్జీతో పాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ● 5 నుంచి 20 కిలోవాట్‌ వరకు రూ.2,900 తోపాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.1500 చెల్లించాలి. 20 కిలోవాట్‌పైన ప్రతీ కిలో వాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి. ● ఇక గృహేతర, వాణిజ్య వినియోగదారులు కిలోవాట్‌ వరకు కనీస చార్జీ రూ.1000 చెల్లించాలి. 1 నుంచి 5 కిలో వాట్‌ వరకు రూ.1000తో పాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.1200 చొప్పున కనీస చార్జీలు ఉంటాయి. ● 20 కిలోవాట్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే కిలోవా ట్‌కు రూ.4 వేల చొప్పున రుసుం ఉంటుంది. ఆ పైన ప్రతీ కిలో వాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి. ● కేటగిరీలకు కూడా లోడ్‌ ఆధారంగా చార్జీల పెరుగుదల ఉంటుంది. 20 కిలోవాట్‌ కోసం డెవ్‌లాప్‌మెంట్‌ చార్జీలతో పాటు ఎస్‌ఎల్‌సీ చార్జీలు వర్తిస్తాయి. 20 కిలోవాట్‌పైన ఉంటే కేవలం ఎస్‌ ఎల్‌సీ చార్జీలు మాత్రమే వర్తిస్తుండగా, డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

వాంకిడి: రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి తీసుకువచ్చిన నూతన విధానంతో విద్యుత్‌ సేవలు సులభతరంగా, పారదర్శకంగా అందనున్నాయి. కొత్త ఎల్‌టీ కనెక్షన్లు, అదనపు లోడ్‌ సర్వీస్‌ లైన్‌ చార్జీలు లోడ్‌ ఆధారంగా చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వ్యక్తిగత క్షేత్రస్థాయి తనిఖీల అవసరం లేకుండా కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంలే సంబంధిత అధికారులు ఎస్టిమేషన్‌ ప్రతిపాదనలు రూపొందించి దాని ప్రకారం దరఖాస్తుదారులు రుసుం చెల్లించేవారు. ఈ విధానాన్ని సవరిస్తూ విద్యుత్‌ నియంత్రణ మండలి కొత్తగా రెగ్యులేషన్‌ నం.1 ఆఫ్‌ 2026 ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన పద్ధతిలో ఒక కిలోమీటరు దూరం వరకు ఎలాంటి చార్జీలు వర్తించవు. కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉండే సర్వీసులకు మాత్రమే లోడ్‌ ఆధారంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన లేకుండానే త్వరితగతిన సర్వీసులు మంజూరు చేస్తారు. కాగా జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి.

నూతన విధానంలో చార్జీల వివరాలు

జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గృహ వినియోగ కనెక్షన్లు 1,41,933 ఉండగా, వ్యాపార కనెక్షన్లు 15, 190, వ్యవసాయ కనెక్షన్లు 15,373 ఉన్నాయి. నూతన విధానంలో గృహ వినియోగదారులు కిలో వాట్‌ వరకు 500 సర్వీస్‌ లైన్‌ చార్జీలు చెల్లించాలి.

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్‌ల వివరాలు

గృహ వినియోగ 1,41,933

వ్యాపార 15,190

ఎల్‌టీ ఇండస్ట్రీయల్‌ 630

కోటేజ్‌ ఇండస్ట్రీస్‌ 11

వ్యవసాయం 15,373

హైటెన్షన్‌ కనెక్షన్‌లు(హెచ్‌టీ) 104

ఇతరాలు 5,720

లోడ్‌ ఆధారంగా చార్జీలు..

అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మల్టీస్టోర్‌ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్‌ లోడ్‌ ఆధారంగా చార్జీలు వర్తిస్తాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు ఖర్చు భారం వినియోగదారుడిపై మోపరు. ట్రాన్స్‌ఫార్మర్‌ సరఫరా, ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు ఉండవు. శాఖ వారే బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏకరీతి విధానంతో రైతులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు సులభంగా అందనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement