జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్ష విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్ష విజయవంతం

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఎంపిక చేసిన 23 ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్‌ లర్నింగ్‌ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్‌) పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు డీఈవో లలిత అన్నారు. పరీక్ష విజయవంతంగా పూర్తిచేసిన ఛాత్రోపాధ్యాయులను మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో అభినందించారు. డీ ఈవో మాట్లాడుతూ జిల్లాలోని 23 పాఠశాలల నుంచి 229 మంది మూడో తరగతి విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. చదవడం, రా యడం, గణిత నైపుణ్యాలను అంచనా వే యడం ఈ పరీక్ష ఉద్దేశమన్నారు. ఫలితాల ఆధారంగా అభ్యాస స్థాయిని విశ్లేషించి లోపాలను గుర్తిస్తామని, భవిష్యత్తులో తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement