కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ ఆరోపించారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో మంగళవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లను తాము అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా నాయకులు కార్తీక్, టీకానంద్, ముంజం ఆనంద్‌కుమార్, శ్రీనివాస్, అనిత, త్రివేణి, జాదవ్, రాజేందర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


