వందశాతం వార్షిక ఉత్పత్తి సాధించిన బెల్లంపల్లి ఏరియా గడువుకు ముందే లక్ష్యం చేరుకోవడంపై అధికారుల హర్షం సత్ఫలితాలు ఇచ్చిన సమష్టి కృషి, ముందస్తు ప్రణాళికలు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా మరో ఏడాది సైతం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. వరుసగా మూడేళ్లు లక్ష్యాన్ని చేధించడం ఏరియా చరిత్రలో ఇదే తొలిసారి. అధిక వర్షాలు, పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని రవాణాకు ఆటంకాలు, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు.. వంటి అనేక సవాళ్లు ఎదురైనా ఉద్యోగులు గడువుకు రెండు రోజుల ముందే లక్ష్యాన్ని సాధించారు. యాజమాన్యం తీసుకున్న ముందస్తు చర్యలు, సమష్టి కృషి, ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయి.
భారం మోసిన ఖైరిగూర ఓసీపీ
బెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడేది. కాలక్రమేణా భూగర్భ గనులు, ఓసీపీలు మూ తపడ్డాయి. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఒక్కో గని మూ తవేతకు గురికాగా ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీ ఒక్కటే మిగి లింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకపోవడంతో గోలేటి ఓసీపీ ప్రారంభానికి నోచుకోలేదు. అయినా దానికి అతికొద్ది మొత్తంలో ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు. దీంతో వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనలో ఏరియాకు ఖైరిగూర ఓసీపీ గుండెకాయలా మారింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా ఆదివారం నాటికే 35.14 లక్షల ఉత్పత్తిని సాధించి వందశా తం లక్ష్యం పూర్తి చేసింది. ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే ఖైరిగూర ఓసీపీ ఏరియా భారాన్ని భుజాన వేసుకుని వందశాతం ఉత్పత్తిని అందించి ఏరియాకు తలమానికంగా మారింది. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఖైరిగూర ఓసీపీ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చరిత్ర సృష్టించింది. ఒక్క రోజే 26,426 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు అంతే మొత్తంలో రవాణా చేసి గత రికార్డులను తిరగరాసింది.
ప్రతిబంధకంగా మారిన వర్షాలు
ఉత్పత్తి లక్ష్య సాధన అనుకున్నంత సులువుగా ఏమీ జరగలేదు. గతేడాదితో పోల్చితే ఈసారి అధిక వర్షాలు ప్రతిబంధకంగా మారాయి. ఖైరిగూర ఓసీపీ వెళ్లే మార్గంలోని పావురా ల గుట్ట వద్ద కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో పూ ర్తిగా దెబ్బతింది. ఓసీపీకి వెళ్లే అవకాశమే లేకపోవడంతో ప్ర త్యామ్నాయ మార్గం ద్వారా ఉద్యోగులను తరలించారు. దా దాపు 15 రోజులపాటు బొగ్గు రవాణా ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది ఏరియాలో 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే.. ఈసారి ఏకంగా 2099 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. పంప్ మోటర్ల ద్వారా క్వారీలోకి చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తోడారు. వర్షం తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తిని కొనసాగించారు. ఓబీ వెలికితీత కాంట్రాక్టర్ సహకారం కూడా కలిసి వచ్చింది. లక్ష్యానికి తగినట్లుగా ఓబీ వెలికితీత సాగడంతో బెంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వర్షాకా లంలో కోల్పోయిన ఉత్పత్తిని వర్షాలు తగ్గుముఖం పట్టిన త ర్వాత చేపట్టేందుకు యాజమాన్యం ప్రణాళికలు అమలు చే సింది. అంతిమంగా అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి బెల్లంపల్లి ఏరియాను వరుసగా మూడో సంవత్సరం కూడా వార్షిక లక్ష్యం సాధించిన ఏరియాగా నిలబెట్టారు.
అందరి సహంకారతోనే ఉత్పత్తి లక్ష్య సాధన
బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేధించినట్లు జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే 35లక్షల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఖైరిగూర ఓసీపీలో సోమవారం అధికారులు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ఆదివారం నాటికి 35.14లక్షల టన్నుల ఉత్పత్తి సాధించించామన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజే 26,426 టన్నుల ఉత్పత్తి సాధించడంతో పాటు బొగ్గు రవాణాను చేయడం అభినందనీయమని కొనియాడారు. ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.


