పరిమితి పెరిగింది | - | Sakshi
Sakshi News home page

పరిమితి పెరిగింది

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

జిల్లాలో 4.45లక్షల ఎకరాల్లో సాగు ఏప్రిల్‌ 10 నుంచి రుణాల పంపిణీ 128 రకాల పంటలకు పెరుగుదల 1.43 లక్షల మంది రైతులకు మేలు హర్షం వ్యక్తంజేస్తున్న అన్నదాతలు

దహెగాం: ప్రభుత్వం పంటల రుణ పరిమితిని పెంచగా రైతులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. పంటల సా గు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏటా రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ రుణ పరిమితులను సూచిస్తోంది. ఆ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర సహకార అపె క్స్‌ బ్యాంక్‌ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వానా కాలం, యాసంగి పంటల రుణ పరిమితి పెంచింది. ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలని ఖరారు చేస్తూ ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్ల కమిటీ) కి పంపించింది. దీంతో పంట రుణాల పరి మితిని పెంచుతూ ఎస్‌ఎల్‌బీసీ జిల్లా, మండలాల బ్యాంకర్లకు సర్క్యులర్‌ పంపించారు. ఈ రుణ పరి మితిని ఏప్రిల్‌ నుంచి వర్తింపజేస్తారు. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్ల కూ ప్రభుత్వం రుణపరిమితి పెంచింది. రుణాల పంపిణీలో పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరదనే ఆరో పణలున్నాయి. జిల్లాలో అధికంగా పత్తి, వరి సాగు చేసే రైతులే పంట రుణలు తీసుకుంటున్నారు.

సాగు విస్తీర్ణం ఇలా..

జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సా గవుతున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నా యి. జిల్లాలో 1.43 లక్షల మంది రైతులుండగా, సు మారు 1.37లక్షల మంది పంట రుణాలకు అర్హులు. కాగా, వీరిలో 78శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆ శ్రయిస్తున్నారు. బ్యాంకర్లు ఇస్తున్న పంట రుణాల కు వడ్డీ తక్కువ ఉండగా పట్టా పాస్‌బుక్‌ కలిగిన ప్ర తీ రైతు సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీ సుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ, పట్టా పాస్‌బుక్‌ ఉన్నా స్థానికంగా లేకపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.

గతం కంటే లాభం అదనం

పంటల రుణ పరిమితి పెంచడంతో వరికి గతేడాది రూ.46 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48వేలు అందనుంది. దీంతో రైతులకు అదనంగా రూ.2వేలు రా నున్నాయి. పత్తికి రూ.4వేలు, మిర్చికి రూ.4వేలు, కందికి రూ.2వేలు, సోయాకు రూ.2వేలు, పెసర, జొన్న, మక్క, పంటలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అదనంగా రానున్నాయి. దీంతో పంటల సా గుకు అవసరమైన పెట్టుబడులకు ఇబ్బందులు రా కుండా ఉపశమనం కలగనుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా, ఐదెకరాలకు పైగా ఉ న్న రైతులకు రూ.2లక్షలకు మించి రుణాలివ్వడంలేదని చెబుతున్నారు. అడిగితే.. బ్యాంకర్లు కండిషన్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీల నేపథ్యంలో రూ.2లక్షల వర కు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రటించి కు టుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో చాలామంది రైతులకు రూ.2లక్షల వరకు రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు రూ.2లక్షల లోపు పరిమితితోనే రుణాలు తీసుకుంటున్నారు. రుణ పరిమితి పెంపుతో జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుంది.

గతేడాది లక్ష్యం రూ.3.23 కోట్లు

2025–26 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యం రూ.3.23 వేల కోట్లు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా స్థాయి సమీక్షల్లో బ్యాంకర్లకు సూచించినా 50శాతం కంటే మించలేదని తెలిసింది. గత ఫిబ్రవరి వరకు 49శాతం అనగా రూ.1,581 కోట్ల రుణాలే ఇచ్చారు. తీసుకున్న రుణాలు రెన్యూవల్‌ చేయకపోవడంతోనే లక్ష్యాన్ని చేరుకోవడం లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement