ఆసిఫాబాద్: క్షయ రహిత సమాజానికి కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సీతారాం సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినో త్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వాస్పత్రి నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన శైలి ద్వారా క్షయను నివారించవచ్చని తెలిపారు. వ్యాధిగ్రస్తులు దగ్గినపుడు, తుమ్మినపుడు నోటి మాస్క్ ధరించాలని, తప్పనిసరిగా చికి త్స పొందుతూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ ఉన్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలి పారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో క్షయ నిర్ధారణ పరీక్షాకేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య అధికారి వినయ్, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్, విజయమ్మ, సీఎన్‌వో పవన్‌కుమార్, ఆశ కార్యకర్తలు, ఎన్‌జీవో ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


