ఉద్యోగులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

పెంచికల్‌పేట్‌: ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ హరిత సూచించారు. మంగళవారం మండలంలో పర్యటించారు. పీహెచ్‌సీ, కేజీబీవీ, బొంబాయిగూడ అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమికో న్నత పాఠశాలను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో స్టోర్‌రూం, ఆపరేషన్‌ థియేటర్‌, ఉద్యోగుల హాజరు రిజి ష్టర్‌ పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజ న మెనూ పరిశీలించారు. పదోతరగతి విద్యార్థినులతో ముచ్చటించారు. కేజీబీవీలో చేపట్టిన నిర్మాణ ప నులు పరిశీలించారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిబ్బంది కలెక్టర్‌కు విన్నవించారు. బొంబాయిగూడలోని ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం పరిశీలించారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్‌ హరిత సూచించారు. మంగళవారం కాగజ్‌నగర్‌ మండలంలోని జంబుగ రైతువేదికలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని భూగర్భ జలశాఖ, సమృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. వాగులపై చెక్‌ డ్యామ్‌లు, నీటికుంట లు, బోర్ల సమీపంలో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇంకుడుగుంతలతో వర్ష పు నీరు భూమిలోకి చేరి నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. దీని ద్వారా సాగు, తాగునీటికి ఎ లాంటి ఇబ్బందులుండవని వివరించారు. ప్రజావా ణిలో ఎక్కువగా చేతిపంపులు, బోరు బావులు మంజూరు చేయాలని అర్జీలు వస్తున్నాయని తెలిపారు. భూగర్భ నీటి మట్టం పెరగాలంటే ప్రతీ ఇంటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించారు. జిల్లా నీటి వనరులశాఖ అధికారులు, డీఏవో వెంకట్‌, ఉ ద్యానవనశాఖ అధికారి నదీం, మిషన్‌ భగీరథ ఈ ఈ సిద్దిక్‌, ఎండీ సాంబశివరావు, రైతులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement