జెడ్పీ హైస్కూల్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ హైస్కూల్‌ తనిఖీ

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రధ్ధాశుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, మధ్యాహ్న భోజన వంట గది, వంటలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బోధన తీరు, తరగతి గదులు, పాఠశాల సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, పా ఠశాల రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉత్తమ ఫలి తాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. తహసీల్దార్‌ రహీమొద్దీన్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement