కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాల విద్యార్థులు మంగళవారం పట్టణ సమీపంలో ని సేంద్రియ వ్యవసాయ యూనిట్‌ను సందర్శించా రు. కళాశాల ఎకోక్లబ్, భౌతిక రసాయన శాస్త్రం వి భాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సా గు పద్ధతులు, పర్యావరణ రహిత, సాంకేతిక విధానాల వినియోగంపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జల్ జీవిక సెంటర్ ఫర్ అక్వాటిక్ లైవ్లీహుడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పద్మాకర్ సేంద్రియ వ్యవసాయ విధానాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు వాడకుండా బీడు భూములను సాగులోకి తెచ్చి పర్యావరణ హిత సా గు విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం తగ్గుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సి పల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్, శారద, జనార్దన్, రాజేశ్వర్, రోజ్‌మేరి, నర్సింగరావు పాల్గొన్నారు.


