ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు దోని శ్రీశైలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఆర్డీవో లోకేశ్వర్‌రావుకు వినతిపత్రం అందించారు. శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి, రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అరిగెల మల్లికార్జున్, కోట్నాక విజయ్, ఖాండ్రె విశాల్, సుచిత్ తదితరులు పాల్గొన్నారు.


