ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం 2026–27 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువజన రంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. యువతపై ప్రభుత్వానికి బాధ్యత లేదు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, యువతలో ఉన్న ఆందోళనలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జీరో ప్రాధాన్యత ఇచ్చారు. నిరుద్యోగ భృతిపై ఒక్క మాట లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలతో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. డిగ్రీలు ఉన్నా అవకాశాలు ఇవ్వడం లేదు. జాబ్ క్యాలెండర్‌పై ఊసే లేదు.
– ఆత్మకూరి చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి


