ఇంటర్‌ కాలేజీల్లో లంచ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ కాలేజీల్లో లంచ్‌

Mar 21 2026 4:57 AM | Updated on Mar 21 2026 4:57 AM

● జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు ● జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇక నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ఆకలికేకలు తీరనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. ఇంటర్‌ కాలేజీలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులు అర్ధాకలితో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు.

జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు

జిల్లాలో ఆసిఫాబాద్‌, కెరమెరి, వాంకిడి, తిర్యా ణి, కాగజ్‌నగర్‌, జైనూర్‌, సిర్పూర్‌(టి), కౌటా ల, బెజ్జూర్‌, దహెగాం, రెబ్బెనలో ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలు ఉన్నాయి. లింగాపూర్‌, పెంచికల్‌పేట్‌, చింతలమానెపల్లి, సిర్పూర్‌(యూ)లో కాలేజీలు లేవు. 4,800 మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో సి ర్పూర్‌ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కోనప్ప తన వ్యక్తిగత నిధులతో విద్యార్థులకు భోజనం అందించారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే సక్కు డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా మధ్యాహ్న భోజనం సమకూర్చారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతూ అధికారులకు విన్నవిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది

ప్రభుత్వం బడ్జెట్‌ సందర్భంగా ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భో జన పథకం అమలుకు శ్రీకారం చుట్టడం ఆ హ్వనించదగ్గ విషయం. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇంటర్‌ విద్య మరింత బలోపేతమవుతుంది.

– రాందాస్‌, డీఐఈవో

ఏటా ఐదు వేల మందికి లబ్ధి

జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటా ఐదు వేల మందికి లబ్ధి చేకూరనుంది. వీరంతా నిరుపేద, మధ్య తరగ తి కుటుంబాలకు చెందినవారే. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు ఐదేళ్లుగా ఇంటర్‌ ఫ లితాల్లో రాష్ట్రస్థాయిలో 1, 2, 3 స్థానాల్లో నిలుస్తూ సత్తా చాటుతున్నాయి. మధ్యా హ్న భోజనం అమలైతే విద్యార్థులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement