‘పర్యాటకం’ పరిచయం చేస్తే బహుమతులు
ఆసిఫాబాద్: జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాల ను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం పర్యాటక శాఖ అధికారి అశ్వక్ అహ్మద్‌తో కలిసి 100 వీకెండ్ వండర్స్ పోస్టర్లు ఆవి ష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు తెలియని జలపాతా లు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్ల వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి, వివరా లతో ఒక కాఫీటేబుల్ బుక్ రూపొందించడమే ఈ పోటీ ఉద్దేశ్యమని తెలిపారు. నేచర్ వైల్డ్ లైఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకా లు, ఫామ్ స్టేస్, రిసార్ట్స్ స్పిరిచువల్ అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చన్నారు. ఎంచుకున్న ప్రదేశం 3 ఫొటోలు, 60 సెకన్ల వీడి యో, రవాణా, బస, బడ్జెట్ వివరాలతో 100 పదా ల సమాచారాన్ని పోర్టల్‌లో పేర్కొన్న గూగుల్ ఫా మ్, సోషల్ మీడియా అకౌంట్లకు ట్యాగ్ చేయవచ్చ ని తెలిపారు. ఉత్తమ ఎంట్రీకి మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలతోపాటు కన్సల్టేషన్ బహుమతులుగా హరితా హోటళ్లలో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల వారు జనవరి 5లోగా ఎంట్రీలు పంపించాలని సూచించారు.


