‘ఎస్పీఎం యాజమాన్యం మొండి వైఖరితో నష్టం’
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరితో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్(రి.నం.2381) ఉపాధ్యక్షుడు గోలెం వెంకటేశ్ అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని కోసినిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మిల్లులో పనిచేస్తున్న శాశ్వత కార్మికులకు యాజమాన్యం జీతం స్లిప్‌లలో ఓటీ అని చూపించకుండా గుడ్‌విల్ అని నమోదు చేయిస్తుందన్నారు. అనారోగ్య సమస్యలతో లోకల్ ఆఫీస్ సెలవులు పెడితే లీవ్ డబ్బులు ఇవ్వడం కుదరదని చెబుతున్నారని మండిపడ్డారు. పాత మాదిరిగానే కార్మికులకు ఓటీ స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు శ్యాంరావు, రాజమౌళి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.


