టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కౌటాల(ఆసిఫాబాద్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని మళ్లీ ఇప్పుడు అర్హత పరీక్ష రాయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంపత్, విజయ్, దేవరావు, సీమ, భీంరావు, ఇందిరా, మనీషా, మా ధురి, అర్చన, తిరుమల తదితరులు పాల్గొన్నారు.


