విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: ఇటీవల జరిగిన ఎస్‌జీఎఫ్‌తోపాటు వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులతోపాటు కోచ్‌లు, పీడీలను గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


