అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ తనిఖీ
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్‌పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలో వెంకట్రావ్‌పేట్ గ్రామ సమీపంలో ఉన్న చెక్‌పోస్ట్‌ను సోమవారం కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ–మహారాష్ట్రల నుంచి వచ్చి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. అనంతరం మినిట్ టూ మినిట్ బుక్ రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ రహీమొద్దిన్, సిబ్బంది ఉన్నారు.


