కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో సోమవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికలకు కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించినట్లు సెక్రెటరీ వెంకటేశం తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి 200కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఒక్కోజట్టుకు 12 మంది చొప్పున జోనల్‌స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్, రామ్మోహన్, పీడీలు తిరుపతి, కృష్ణమూర్తి, రాజన్న, శారద, హరికృష్ణ, సత్యనారాయణ, అజయ్, ఖేల్ ఇండియా కోచ్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.


