‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి’
ఆసిఫాబాద్: ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద జిల్లాలోని పీవీటీజీ కొలాం, తోటి, ఆది వాసీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని పీవీటీజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీమ్‌రావు డిమాండ్ చేశారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు మార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేస్తే ఇప్పటి వరకు ఇళ్లు మంజూరయ్యేవన్నారు. కార్యక్రమంలో పీవీటీజీల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు, కొలాం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిడాం రాజు, సిడాం ధర్ము పాల్గొన్నా రు.


