ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా సావర్‌ఖెడా
కెరమెరి: మండలంలోని సార్‌ఖేడా ప్రాథమిక పాఠశాల మల్టిజోన్ 1లో ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లోని కుమురం భీం భవన్‌లో ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధా, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు మెమొంటో అందుకున్నారు. డిజిటల్ విద్యాబోధన, విద్యాసామగ్రి వినియోగం, విద్యార్థులను క్షేత్రపర్యటనలకు తీసుకెళ్లడం, తదితర కార్యక్రమాల అమలు చేయడంతో ఎంపికై నట్లు హెచ్‌ఎం పేర్కొన్నారు.


