భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌లతో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాబైనామాలకు సంబంధించి రికార్డులతో సరిచూసి నోటీసులు జారీ చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, తదితరులు పాల్గొన్నారు.
నీటి నిల్వ ప్రాంతాలను సర్వే చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో 2.50 హెక్టర్ల కంటే అధిక నీరు నిలిచిన ప్రాంతాలను సర్వే చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం రెవెన్యూ, నీటిపారుదల, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ అధికారులతో నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో 2.50 హెక్టార్ల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న నీటి వనరులు దాదాపు 150 వరకు ఉన్నాయని, వాటిని సర్వే చేసి మ్యాప్‌లు సిద్ధం చేయాలన్నారు. అవి నిండడానికి గల పరిసర ప్రాంతాలు, క్యాచ్‌మెంట్ ఏరి యాలను సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతిగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వెంక టి, నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుణవంత్‌రావ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


