
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఉపాధిహామీ ప్రోగ్రాం అధికారులు, ఐకేపీ ఏపీఎంలు, గృహనిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఆస్తిపన్ను వసూలు, పారిశుధ్య నిర్వహణ, వారసంత వేలం డబ్బు ల వసూలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ కార్యదర్శుల హాజరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,745 ఇళ్ల పనులు ఈ నెల 23వరకు ప్రారంభించాలని తెలిపారు. పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. మండల సమాఖ్య నుంచి లబ్ధిదారులకు కొంత రుణం అందించాలని, గ్రామపంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూలు చేయాలని, పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. మరుగుదొడ్లు లేని గృహాలను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల హాజరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపా రు. అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డివిజనల్ పంచాయతీ అధికా రి ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.