
ప్రయత్నం ఫలిస్తోంది
జిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్లమెంట్‌లో రెండుసార్లు ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను స్వయంగా కలిసి విన్నవించాను. వారు స్పందించి అవసరమైన మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవడంతో నా ప్రయత్నం ఫలించినట్లవుతుంది. త్వరలో నే పనులు వేగవంతమయ్యే అవకాశముంది.
– గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
‘సాక్షి’ చొరవ అభినందనీయం
‘సాక్షి’ దినపత్రిక మార్చి 5న అన్ని వర్గాలతో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆయా వర్గాలవారు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ సాధనకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. అదే వేదికపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. దీంతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. వారు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడంతో లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. – సోగాల సుదర్శన్,
ఎయిర్‌పోర్టు సాధన అడహక్ కమిటీ సభ్యుడు

ప్రయత్నం ఫలిస్తోంది