
న్యాయ సేవా కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో న్యాయ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వయోవృద్ధుల సంక్షేమం కోసం న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం ప్యానెల్ న్యాయవాదిగా కుడ్క కిశోర్, పారా లీగల్ వ లంటీర్‌గా చునర్కర్ లింగయ్యను నియమించినట్లు తెలిపారు. ప్రతీ శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వర కు ఈ కేంద్రం ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.