బీసీ బంద్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌ సక్సెస్‌

Oct 19 2025 6:13 AM | Updated on Oct 19 2025 6:13 AM

బీసీ బంద్‌ సక్సెస్‌

బీసీ బంద్‌ సక్సెస్‌

● స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారులు ● డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ● బీసీ జేఏసీ నాయకుల రాస్తారోకో ● 42 శాతం రిజర్వేషన్‌కు డిమాండ్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. బీసీ జేఏ సీ నాయకులు ముందురోజే బంద్‌కు సహకరించా లని కోరడంతో జిల్లా కేంద్రంలో వ్యాపారులు స్వ చ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. శనివారం ఉద యం నుంచే బీసీ జేఏసీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. ఎక్కడైనా దుకాణాలు తెరిచి ఉంటే మూసివేయించారు. పలుచోట్ల దుకాణాలు తెరిచిన వ్యాపారులు, బీసీ నాయకుల మధ్య వాగ్వాదం చో టు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రతీ శనివారం నిర్వహించే వారసంతపై బంద్‌ ప్రభావం పడింది. పెట్రోల్‌ బంక్‌లు యథావిధిగా తెరిచి ఉన్నాయి. మ ధ్యాహ్నం 12గంటల తర్వాత వ్యాపార సముదా యాలూ తెరుచుకున్నాయి. బీసీ జేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీ సీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలయ్యేదాకా ఉద్య మం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికై నా రా జకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని మార్చుకుని బీసీల కు 42శాతం రిజర్వేషన్‌ అమలయ్యేందుకు సహకరించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మల్లేశ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, ఎ మ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు కేశవ్‌రావ్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్ర ణయ్‌, బీజేపీ నాయకుడు ఖాండ్రె విశాల్‌, బీఆర్‌ఎ స్‌ నాయకులు బుర్స పోచయ్య, జీవన్‌, పార్టీలు, సంఘాల నాయకులు నారాయణ, ఆంజనేయులు, జక్కయ్య, శ్రీకాంత్‌, ఉమేందర్‌, లింగయ్య, మంగ, యాదగిరి, బాబుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ పట్టణంలో..

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘం నాయకులు పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి పలు వీ ధుల గుండా ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు డు తుమ్మ రమేశ్‌ మాట్లాడుతూ.. బీసీల బంద్‌ పి లుపునకు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు, ఎమ్మార్పీఎస్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సంఘాలు సంపూర్ణ మద్ధతు తెలిపాయని పేర్కొన్నారు. వెంటనే బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ క ల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎండగడుతూ చావోరేవో తేల్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రిజ ర్వేషన్లు సాధించేవరకూ బీసీలు ఐక్యంగా ఉండాల ని పిలుపునిచ్చారు. నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్‌, దస్తగీర్‌, గోలెం వెంకటేశం, సత్యనారాయణ, తిరుపతి, వీరభద్రాచారి, నాగేశ్వర్‌రావు, రమణయ్య, షబ్బీర్‌ హుస్సేన్‌, గడదాసు మల్లయ్య, మాచర్ల శ్రీనివాస్‌, మేరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేస్తున్న బీసీ జేఏసీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement