
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్‌లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా పశువైద్యాధికారి సురేశ్‌కుమార్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పశువులు వ్యాధుల బారినపడుతున్నాయని తెలిపారు. రైతులు తమ ఆవులు, గేదెలు, ఎద్దులకు టీకాలు వేయించాలని సూచించారు. అలాగే పశువైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయంలో సంప్రదించాలన్నారు. అనంతరం పశువులకు బలాన్ని అందించే మల్టీమిక్స్ పౌడర్ ప్యాకెట్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది మోతీరాం, సుప్రియ, పద్మ, ప్రశాంత్, వినోద్ పాల్గొన్నారు.