
‘విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలి’
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి, కెరమెరి ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు ప్రతీ పాఠశాలను సందర్శించి హాజరు శాతంపై ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. పదో తరగతి వి ద్యార్థులపై దృష్టి సారించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, ఎస్‌వో అబిద్ అలీ, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.