ఏపీ సర్కారు తీరు సరికాదు.. ‘సాక్షి’పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఆసిఫాబాద్‌అర్బన్: అక్షరంపై కక్ష కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉందని ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’పై అక్కసు చూపిస్తున్నారు. వార్తలకు భయపడి పత్రిక గొంతు నొక్కాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఖాకీలతో సర్కారు చేయిస్తున్న దమనకాండపై జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటికి పలు జర్నలిస్టు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
కక్ష సాధింపు సరికాదు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ యాజమాన్యంపై అవలంబిస్తున్న కక్ష సాధింపు ధోరణి సరికాదని టీయూడబ్ల్యూజే టీయూడ బ్ల్యూ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, సీనియర్ జర్నలిస్టులు రావుల శంకర్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీని వాస్‌రావులు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పటికై నా సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో జర్నలి స్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని కూటమి ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యులు ప్రకాశ్‌గౌడ్, శ్రీధర్, జానకీరాం, సురేశ్‌చారి, హనుమయ్య, రాధాకృష్ణచారి,ఽ తాటిపల్లి ఆశిష్, ముబ్బషీర్, శ్రీకాంత్, మహిళా జర్నలిస్టు గిరిజ, తదితరులు పాల్గొన్నారు.
మీడియా గొంతు నొక్కడమే..
సాక్షి దినపత్రిక కు పదేపదే నోటీసులు ఇస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అంటే మీడియా గొంతు నొక్కడమే. వార్తలు రాస్తే కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఒక్క కేసులో 4, 5 నోటీసులు జారీ చేయడం సమంజసం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యంపై, జర్నలిస్టులపై కొనసాగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
– అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు
అక్షరంపై కక్ష కడుతారా..!
అక్షరంపై కక్ష కడుతారా..!