
‘నేటి బీసీ బంద్ జయప్రదం చేయండి’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, వివి ధ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ రూప్‌నార్ రమేశ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని వ్యాపారులు, కుల సంఘాల నాయకులు, ఆర్టీసీ అధి కారులను కలిసి బంద్‌కు సహకరించాలని విన్నవించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించ ని వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘాల జేఏ సీ నేటి బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నా రు. బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, జేఏసీ నాయకులు యాదగిరి, లవుకుమార్, నాగోసె శంకర్, షేక్ అసద్, మారుతి, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.