
‘ఆశ్రమ’ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. శుక్రవారం మండలంలోని మోడి ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ(మోడి)ల ను ఆమె సందర్శించారు. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, సీఆర్‌టీలకు ప్రతీనెల 1వ తే దీన వేతనాలు చెల్లించాలని, ఎంటీఎస్ వర్తింపజేస్తూ హెల్త్‌కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల తనిఖీల కోసం అధికా రులు ఉండగా మళ్లీ పర్యవేక్షణ నిమి త్తం తని ఖీ అధికారులను నియమించ డం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల సిబ్బంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు.