
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల వినియోగం, పేదరిక ని ర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే సందర్భంలో ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడంతో పాటు టోల్ ఫ్రీ నం. 15100ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, ఏడీఏ మిలింద్‌కుమార్, రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.