
‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపరు మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్ శ్రీదాన కిశోర్‌కు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని బుధవారం కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. చాలా కాలంగా ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారని ఎమ్మెల్యే తెలిపారు.