
సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తాం
కౌటాల(సిర్పూర్): గ్రామాలకు సక్రమంగా మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఈ ఎ.రవీందర్ అన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘భగీరథ బంద్..!’ కథనానికి అధికారులు స్పందించారు. వీర్ధండి గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులు, నల్లాలను మంగళవారం పరిశీలించారు. ప్రతీ ఇంటింటికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఈఈ వి.రాజేశ్, ఏఈఈ సాయిసిద్ధార్థ, ఖాజా ముజహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఎఫెక్ట్

సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తాం