
మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్(టి)లోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల భవనాల కు మరమ్మతులు చేపట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. గురుకుల పాఠశాలలో చదువుతు న్న 500 మంది విద్యార్థులు విద్యా సంవత్స రం నష్టపోకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మరమ్మతుల కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు.