
హోరాహోరీగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. డీఎస్‌వో షేకు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పో టీలకు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. 100, 200, 400 మీటర్ల ర న్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 60 మందిని జోనల్‌స్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీఈటీలు శారద, హరీశ్, రాకేశ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.