
బీసీ జేఏసీ చైర్మన్‌గా రమేశ్
ఆసిఫాబాద్: బీసీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన రూప్‌నర్ రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్‌గా ప్రణయ్, వైస్ చైర్మన్లుగా ఖాండ్రే విశాల్, మాచర్ల శ్రీనివాస్, గాజుల జక్కయ్య, నికోడె రవీందర్, దీపక్ ముండే, పొన్న రమే శ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోట వెంకన్న, బొర్కుటె తిరుపతి, లహుకుమార్, మేరాజ్, పురుషోత్తం బాలేశ్, రాపర్తి కార్తీక్, మామిడి కిరణ్, పర్రె గిరి, నాందేవ్, నాగపురి మారుతి, షేక్ అసద్, ఉమేందర్ ఎన్నికయ్యారు.