
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
ఆసిఫాబాద్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాల్లో అధికా రులు, సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సూచించారు. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్లలో నమోదైన వ్యక్తులతోపాటు గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు నిర్మూలన కోసం పోలీస్ సెర్చ్ టీములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరా ల నిర్మూలనకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీపావళి నేపథ్యంలో బాణసంచా దు కాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదా లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎ స్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.