
రాష్ట్రస్థాయి పోటీలకు వేళాయె
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం తెలంగాణ రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా క్రీడా పోటీలకు వేదికగా మారింది. శనివారం నుంచి రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడాపోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు తరలిరానున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి వందలాది మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నా రు. అండర్– 14, 19 విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. అండర్– 14 విభాగంలో బాలుర జట్లు 10, బాలికలు జట్లు 7, అండర్– 19లో బా లుర జట్లు 10, బాలికల జట్లు 8 పాల్గొననున్నాయి. క్రీడాకారులతోపాటు కోచ్‌లు, మేనేజర్లు, అసోసియేషన్ అఫీషియల్స్‌తో కలిసి సుమారు 250 మంది హాజరుకానున్నారు.
క్రీడాకారులకు సౌకర్యాలు
రెండు రోజులపాటు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం క్రీడాకారులతో కళకళలాడనుంది. వివి ధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు సెపక్‌తక్రా అసోసియేషన్ ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. గోలేటి టౌన్‌షిప్‌లోని సీ టైప్, డీ టైప్ క్వార్టర్లతోపాటు సింగరేణి పాఠశాలను క్రీడాకారుల వసతి కోసం కేటాయించగా, సీఈఆర్ క్లబ్‌లో భోజన వసతికి ఏర్పాట్లు చేశారు. శనివా రం ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా పోటీలు ప్రారంభిస్తారు. సింగరేణి మై దానంలో ఏర్పాట్లను శుక్రవారం సెపక్‌తక్రా అసో సియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి తదితరులు పరిశీలించారు.