
పోక్సో కేసుల్లో తప్పనిసరిగా గోప్యత పాటించాలి
ఆసిఫాబాద్: పోక్సో కేసుల్లో తప్పనిసరిగా గోప్యత పాటించాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్‌లో మంగళవారం పోక్సో ఆక్ట్–2012 పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు తీ రు, బాధితులకు సౌకర్యాలు, వారి గోప్యత, గౌరవ భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చైల్డ్ ప్రొటెక్షన్‌పై జిల్లా సంక్షేమశాఖ, సఖీ కేంద్రం నిర్వాహకులతో సమీక్షించారు. సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, పీపీ జగన్మోహన్‌రావు, డీసీపీవో మహేశ్, పోక్సో కోర్టు స్పెషల్ పీపీ శ్రీనివాస్, సీఐ బాలాజీ వరప్రసాద్, శైలజ పాల్గొన్నారు.