సిర్పూర్ (టీ): ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లుగా తయారు చేసిన సిర్పూర్ గురుకుల పాఠశాల మూతపడే ప్రమాదంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవడంలేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్ ఆరోపించారు. మంగళవారం సిర్పూర్‌లోని గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయలేక పాఠశాలనే ఇతర ప్రాంతానికి తరలించాలని చూడడం దారుణ మని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులకు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడంతోనే సరి పోతోందని, విద్యార్థుల సమస్యలు పట్టించుకో వడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇప్పటివరకు 106మంది విద్యార్థులు మరణించారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆ త్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్థానిక ఎ మ్మెల్యేకు గురుకులాలపై పట్టింపు లేదని విమర్శించారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళ న చేస్తున్నా, వారి తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కలెక్టర్, అధికారులు పట్టించుకోవడం లే దని ఆరోపించారు. సిర్పూర్ గురుకుల పాఠశాలను తామే కాపాడుకుంటామని, అవసరమైతే తల్లిదండ్రులతో కలిసి శ్రమదానం చేసి మరమ్మతులు చేసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా పట్టించుకోకుంటే భవిష్యత్ పరిణామాలకు కలెక్టర్, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వ స్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట విద్యార్థుల తల్లిదండ్రులు, మండల కన్వీనర్ అస్లమ్, వర్మ, స్వామి, నాయకులు పాల్గొన్నారు.