
అష్టాంగ మార్గాలను అనుసరించాలి
వాంకిడి: భగవాన్ గౌతమ బుద్ధుడు చూపిన అష్టాంగ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని బౌద్ధ బిక్షువు భంతే భరద్వాజ్ సూచించారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార, ఖమాన గ్రామంలోని నాగ్‌సేన్ బుద్ధ విహారాల్లో మంగళవారం బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో వర్షావాస్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాలను ఆవిష్కరించారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు. భంతే భరద్వాజ్ మాట్లాడు తూ.. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని బౌద్ధ మార్గం వైపు నడవాలని సూచించారు. బుద్ధుడు చూపిన పంచశీలాలు, అ ష్టాంగ మార్గాలతో మానవుడు నిజమైన అభివృద్ధిని సాధించగలుగుతాడని తెలిపారు. అనంతరం గ్రంథ పాఠకుడు కిషన్ ఖోబ్రగడే దంపతులను శాలువా లతో సన్మానించారు. అన్నదానం, సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించారు. భారతీయ బౌద్ధ మహా సభ, అంబేడ్కర్ యువజన సంఘం, రమాబాయి మహిళా మండలి సంఘాల నాయకులున్నారు.