
రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలి
వాంకిడి: ఈ నెల 12నుంచి 17వరకు మహా రాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించనున్న స మతా సైనిక్ దళ్ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని బీఎస్‌ఐ, అంబేడ్క ర్ సంఘం నాయకులు కోరారు. మంగళవా రం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహా రలో శిక్షణ శిబిరం కరపత్రం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ.. సమతా సైనిక్ దళ్ అనేది వ్యవస్థీకృత సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం స్థాపించేందుకు సజీవ ఉద్యమాన్ని సృష్టిస్తుందని తెలిపారు. అంబేడ్కర్ స్థాపించిన ఈ సంస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావా లని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రాష్ట్ర ఎస్ ఎస్‌డీ ప్రధాన కార్యదర్శి మార్షల్ దిలీప్ పాటి ల్, కార్యదర్శి మార్షల్ చంద్రబోస్, బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్‌ఎస్ డీ జిల్లా అధ్యక్షుడు సందీప్‌దుర్గే పాల్గొన్నారు.