
భక్తిశ్రద్ధలతో అవ్వల్‌పేన్ పూజ
జోడేఘాట్‌కు చేరిన వంశస్తులు
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో కుమురం భీం వంశస్తులు సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో అవ్వల్‌పేన్ పూజ నిర్వహించారు. మొదట భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. సమాధి, నాలుగు జెండాలకు పూజలు చేశారు. అనంతరం పోచమ్మ తల్లికి గొర్రె పోతును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు భీం మనుమడు సోనేరావు తెలిపారు. నిజాం సైనికులతో చేసిన పోరాటంలో సాయంగా నిలిచిన అవ్వల్‌పేన్(పోచమ్మ)కు ఏటా భీం వర్ధంతికి ముందు రోజు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, వివిధ గోత్రాలకు చెందిన ఆదివాసీలు హాజరయ్యారు.