
పదివేల మందికి పైగా హాజరు..
ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు, కుర్చీలు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్‌ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో జోడేఘాట్‌కు చేరుకునే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గురు, సీఆర్‌టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్‌కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు.

పదివేల మందికి పైగా హాజరు..